🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 1:09 pm Posted by : TELANGANA PRAJA GARJANA

ప్రజా సమస్యలపై పోరాటం.. అభివృద్ధి పనుల ప్రారంభమే లక్ష్యం.

News Image
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట.. అధికారులపై ఒత్తిడి.
రాళ్లగూడలో ఎట్టకేలకు ప్రారంభమైన మురుగునీటి కాలువ పనులు..
పెండింగ్ రహదారి నిర్మాణ పనులపైనా నాయకుల దృష్టి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శంషాబాద్ బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన నిలుస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ 119వ డివిజన్ పరిధిలోని రాళ్లగూడలో ఎన్నో రోజులుగా అసంపూర్తిగా నిలిచిపోయిన మురుగునీటి కాలువ, రహదారి నిర్మాణ పనులపై బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు.రాళ్లగూడలో డ్రైనేజీ, రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన 119వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కోణమొల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు గత వారం హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ కార్యాలయాలను సందర్శించి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పెండింగ్ పనుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి, వెంటనే పనులు చేపట్టాలని కోరారు.బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుపై స్పందించిన అధికారులు సమస్యను పరిశీలించి తాజాగా మురుగునీటి కాలువ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న డ్రైనేజీ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై నాయకులు స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం వల్లే పనుల్లో కదలిక వచ్చిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే తమ బాధ్యతని తెలిపారు. రాళ్లగూడలో డ్రైనేజీ పనుల ప్రారంభానికి 119వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులతో పాటు కార్తీక్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవ, సహకారం అందించారని పేర్కొన్నారు. ప్రారంభమైన మురుగునీటి కాలువ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.అయితే డ్రైనేజీ పనులు ప్రారంభమైనప్పటికీ రహదారి నిర్మాణ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని నాయకులు గుర్తుచేశారు. కాలువ నిర్మాణం పూర్తయిన వెంటనే రహదారి పనులు కూడా చేపట్టి ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేవలం ఫిర్యాదులతో సరిపెట్టకుండా పనులు పూర్తయ్యే వరకు అధికారులను నిరంతరం సంప్రదిస్తామని స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నాయకుల కృషితో పనులు ప్రారంభం కావడం ఒకవైపు సానుకూల పరిణామంగా కనిపిస్తుండగా, మరోవైపు పెండింగ్‌లో ఉన్న రహదారి పనులు ఎప్పుడు పూర్తవుతాయనే దానిపై స్థానికులు ఎదురుచూస్తున్నారు.
ఈ కార్యక్రమంలో 119వ డివిజన్ అధ్యక్షుడు కోణమొల్ల శ్రీనివాస్, 118, 119 డివిజన్ల సమన్వయకర్త బుచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు చిలుకమర్రి పరంధాములు, చిన్నగండు రాజేందర్, సీనియర్ నాయకుడు భైరమోని మల్లేష్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్, దర్శన్ గౌడ్, బీసీ విభాగం అధ్యక్షుడు విజయ్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షుడు జి.వి.పి. సాగర్, శివ గౌడ్, ప్రవీణ్ గౌడ్, దీపక్ గౌడ్, చంద్రశేఖర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కనకటి శివ, సుశాంత్, శ్యామ్, వర్షిత్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home