ఎంఈఓ మంజులాదేవి సేవలు స్ఫూర్తిదాయకం** **పదవీ విరమణ సభకు హాజరైన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్
తెలంగాణ ప్రజాగర్జన.జడ్చర్ల, అక్టోబర్ 29: జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన మండల విద్యాధికారి (ఎంఈఓ) మంజులాదేవి పదవీ విరమణ సన్మాన సభకు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మంజులాదేవి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ విద్యాభివృద్ధికి కృషి చేసి, అందరి మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ప్రశాంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.