శంషాబాద్‌కు కరువు మండల హోదా.. రైతులకు ఊరట! ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు అనేగౌని శ్రీకాంత్ గౌడ్ కృతజ్ఞతలు
రాజేంద్రనగర్, అక్టోబర్ 29(తెలంగాణ రాజాగర్జన: శంషాబాద్ మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించడం పట్ల నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనేగౌని శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కరువు మండలాల జాబితాలో శంషాబాద్‌కు చోటు కల్పించడంతో రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే టీ. ప్రకాష్ గౌడ్‌ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రైతులకు ప్రయోజనకరమన్నారు. ఎల్‌నినో ప్రభావంతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరువు మండలంగా గుర్తింపు లభించడంతో రైతులకు ప్రభుత్వ సహాయక చర్యలు, ఉపశమన కార్యక్రమాలు అందే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ను కరువు మండలంగా ప్రకటించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు శ్రీకాంత్ గౌడ్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.