ఓ నా సిద్ధూ మామయ్య.. సేవకు సలాం! విద్య, ఆధ్యాత్మికత, సామాజిక సేవలో సిద్ధు రెడ్డి ప్రత్యేక ముద్ర ఈ నెల 30న ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల కార్యక్రమానికి భారీగా తరలిరావాలి.. ఆర్. గణేష్ గుప్తా పిలుపు
, • ఓ నా సిద్ధూ మామయ్య.. సేవకు సలాం!
విద్య, ఆధ్యాత్మికత, సామాజిక సేవలో సిద్ధు రెడ్డి తనదైన ముద్ర
ఈ నెల 30న ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదలకు తరలిరావాలి
సాంగ్ విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. ఆర్. గణేష్ గుప్తా పిలుపు
శంషాబాద్, అక్టోబర్ 28 (తెలంగాణ ప్రజాగర్జన): స్వార్థం లేని సేవ.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మనసు.. సమాజ అభ్యున్నతే లక్ష్యంగా సాగించే ప్రయాణం.. ఇవన్నీ కలగలిపిన వ్యక్తిత్వం సిద్ధు రెడ్డిది. విద్య, ఆధ్యాత్మికత, తాగునీటి సమస్యల పరిష్కారం, పాఠశాలల అభివృద్ధి వంటి పలు రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ సర్పంచ్ ఆర్. గణేష్ గుప్తా తెలిపారు. సిద్ధు రెడ్డి సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రూపొందించిన ‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఈ నెల 30న శంషాబాద్ హైస్కూల్ గ్రౌండ్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యతోనే సామాజిక చైతన్యం సాధ్యమని నమ్మే సిద్ధు రెడ్డి పాఠశాలల అభివృద్ధికి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సుమారు 60 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాఠశాల అభివృద్ధి, మరమ్మతుల కోసం తనవంతు కృషి చేశారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు విద్యారంగంపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకరిస్తూ సమాజంలో ఐక్యత, మానసిక ప్రశాంతత పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యల పరిష్కారానికి సైతం తనవంతు సహకారం అందిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్నారు.
సిద్ధు రెడ్డి చేస్తున్న సేవలకు తగిన గుర్తింపు, గౌరవం దక్కాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. ఈ నెల 30న నిర్వహించనున్న ‘ఓ నా సిద్ధూ మామయ్య’ పాట విడుదల కార్యక్రమానికి ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమాజానికి స్ఫూర్తినిచ్చే సేవా కార్యక్రమాలను గుర్తించి, సేవాభావం కలిగిన వ్యక్తులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు.