🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 10:38 am Posted by : TELANGANA PRAJA GARJANA

అర్నాబ్ తుపాను ప్రభావం.. శంషాబాద్‌ నుంచి 13 విమానాలు రద్దు

News Image
అర్నాబ్ తుపాను ప్రభావం.. శంషాబాద్‌ నుంచి 13 విమానాలు రద్దు

విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం సర్వీసులకు అంతరాయం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (తెలంగాణ ప్రజాగర్జన): అర్నాబ్‌ తుపాను ప్రభావంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం (భోగాపురం) వెళ్లాల్సిన 13 విమానాలను రద్దు చేశారు.

తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తుండటంతో విమానాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆకస్మికంగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రద్దయిన విమానాల వివరాలు:

1. IC-3301 – హైదరాబాద్‌ నుంచి విజయవాడ (ఉదయం 6.05 గంటలకు)
2. IX-2401 – హైదరాబాద్‌ నుంచి భోగాపురం (ఉదయం 7 గంటలకు)
3. 6E-714 – హైదరాబాద్‌ నుంచి భోగాపురం (ఉదయం 7.05 గంటలకు)
4. IC-3201 – హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి (ఉదయం 7.25 గంటలకు)
5. 6E-7569 – హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి (ఉదయం 8 గంటలకు)
6. 6E-7529 – హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి (ఉదయం 10 గంటలకు)
7. 6E-879 – హైదరాబాద్‌ నుంచి భోగాపురం (ఉదయం 10.55 గంటలకు)
8. 6E-6263 – హైదరాబాద్‌ నుంచి విజయవాడ (మధ్యాహ్నం 12.20 గంటలకు)
9. 6E-208 – హైదరాబాద్‌ నుంచి భోగాపురం (మధ్యాహ్నం 2.50 గంటలకు)
10. IX-2403 – హైదరాబాద్‌ నుంచి భోగాపురం (సాయంత్రం 5.35 గంటలకు)
11. 6E-2580 – హైదరాబాద్‌ నుంచి విజయవాడ (సాయంత్రం 5.40 గంటలకు)
12. 6E-409 – హైదరాబాద్‌ నుంచి భోగాపురం (సాయంత్రం 6.50 గంటలకు)
13. 6E-6728 – హైదరాబాద్‌ నుంచి భోగాపురం (రాత్రి 8.45 గంటలకు)

ప్రయాణికులకు సూచన...విమాన సర్వీసుల రద్దు, సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు సంబంధిత విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్‌ లేదా కస్టమర్‌ సేవల ద్వారా తాజా వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు ప్రయాణ ప్రణాళికల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
🏠 Home