🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 11:02 pm Posted by : A2TV NEWS

నిరుపేద కుటుంబాలకు అండగా సిఎం రిలీఫ్ ఫండ్

News Image
నిరుపేద కుటుంబాలకు అండగా సిఎం రిలీఫ్ ఫండ్

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 27 (తెలంగాణ ప్రజా గర్జన):

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేదల వైద్యానికి ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని జిల్లాలోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి, మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని దండేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన పంచర్పూల పోషయ్య వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 5 లక్షల రూపాయల విలువగల ఎల్ఓసి ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే దంపతులకు బాధిత కుటుంబాలు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home