🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 10:45 pm Posted by : TELANGANA PRAJA GARJANA

కరువు జాబితాలో కొందుర్గుకు చోటేది? పంటలు ఎండుతున్నా గుర్తింపు కరువేనా? రైతుల కష్టాలు పట్టించుకోరా? మాజీ ఎంపీటీసీ శివలీల వీరేష్‌ ఆవేదన

News Image

తెలంగాణ ప్రజాగర్జన | కొందుర్గు.తాజాగా ప్రకటించిన కరువు మండలాల జాబితాలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చోటు కల్పించకపోవడంపై విశ్వనాథ్‌పూర్‌ మాజీ ఎంపీటీసీ శివలీల వీరేష్‌ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులను పరిశీలించి కొందుర్గును వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండలంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని, సాగునీటికి నదీ జలాలు, కాలువలు, పెద్ద చెరువులు వంటి ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మండలాన్ని కరువు జాబితాలో చేర్చకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. “కొందుర్గు మండలం ధనిక మండలమా? పంటల దిగుబడులు ఎంత ఉన్నాయి? రైతులంతా ఆర్థికంగా బలంగా ఉన్నారా?” అని ప్రశ్నించారు. ఇప్పటికే సుమారు 10 శాతం మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అందలేదని, దీంతో కొత్త రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, జీవన వ్యయం అధికమవడంతో రైతు కుటుంబాలపై మరింత భారం పడుతోందన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, కొందుర్గు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతోపాటు అర్హులైన రైతులకు తగిన సహాయం అందించాలని శివలీల వీరేష్‌ డిమాండ్‌ చేశారు.
🏠 Home