🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 7:08 pm Posted by : TELANGANA PRAJA GARJANA

శంషాబాద్‌లో సినీ తరహాలో ‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణ! 70 ఎంఎం తెరపై.. డాల్బీ అట్మాస్‌ సౌండ్‌తో గ్రాండ్‌ లాంచ్‌

News Image

తెలంగాణ ప్రజాగర్జన | శంషాబాద్‌//సిద్దు రెడ్డి కందకట్ల తన తొలి గీతం ‘ఓ నా సిద్దయ్య’ పాట ఆవిష్కరణను వినూత్నంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌ 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. భారీ 70 ఎంఎం సినిమా తెరపై, డాల్బీ అట్మాస్‌ సరౌండ్‌ సౌండ్‌తో పాటను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు సిద్దు రెడ్డి అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో పూర్తి పాట విడుదల కానుంది. ఈ కార్యక్రమాన్ని ఏబీఎన్‌, ఎన్‌టీవీ, ఈటీవీ, టీవీ9, 10టీవీ, టీవీ5, వీ6, సాక్షి తదితర చానళ్ల ద్వారా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు ఆహ్వానంలో వెల్లడించారు. తన తొలి పాట విడుదల వేడుకకు అభిమానులు, సంగీతప్రియులు హాజరై విజయవంతం చేయాలని సిద్దు రెడ్డి కందకట్ల, ‘ఓ నా సిద్దయ్య’ బృందం కోరింది.

యూట్యూబ్‌ ఛానల్‌: https://youtube.com/@siddureddyofficial?si=eXzTaC2wmfQsXipG

వేదిక: శంషాబాద్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాల మైదానం.
🏠 Home