🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 3:56 pm Posted by : TELANGANA PRAJA GARJANA

బీసీలకు అన్యాయం.. అగ్రవర్ణాలకు వరాలా? ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై బీసీ సంఘాల నిరసన

News Image
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్‌ 27 (తెలంగాణ ప్రజాగర్జన):ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలోని ముల్కల్లలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీలు ఉద్యమిస్తున్నా తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌, నాయకులు శాఖపురి భీమ్‌సేన్‌, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేష్‌ వర్మ, పడాల శివతేజ, ఎండీ లతీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home