🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 3:34 pm Posted by : TELANGANA PRAJA GARJANA

బాలిక వైద్యానికి రూ.2.50 లక్షల సాయం సీఎం సహాయనిధి ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కిషన్‌నగర్‌ బాలిక చికిత్సకు ఆర్థిక భరోసా

News Image
తెలంగాణ ప్రజాగర్జన షాద్‌నగర్‌ఫరూక్‌నగర్‌ మండలం కిషన్‌నగర్‌ గ్రామానికి చెందిన మహమ్మద్‌ దస్తగిరి కుమార్తె ఎస్‌ఎల్‌ఈ వ్యాధితో బాధపడుతుండటంతో వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. ఈ మేరకు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీని అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వపరంగా సహకారం అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home