🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 1:08 pm Posted by : TELANGANA PRAJA GARJANA

కోకాపేట్‌, నార్సింగిలో ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ పర్యటన రాక్‌వెల్‌ స్కూల్‌ వద్ద విద్యార్థుల భద్రతకు చర్యలు నార్సింగిలో నాలా అభివృద్ధి, బాక్స్‌ కల్వర్టు నిర్మాణంపై పరిశీలన

News Image
తెలంగాణ ప్రజాగర్జన | హైదరాబాద్‌
మీ పాయింట్ ఇక్కడ రాయండి...

కోకాపేట్‌, నార్సింగి ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే టి. ప్రకాష్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. కోకాపేట్‌లోని బీఎస్‌ఆర్‌ అపార్ట్‌మెంట్స్‌ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ లేదా స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాక్‌వెల్‌ పాఠశాల విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా, చిన్నారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అనంతరం నార్సింగి డివిజన్‌ పరిధిలోని మాక్స్‌ కల్వర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ నాలాను అభివృద్ధి చేసి, బాక్స్‌ కల్వర్టు నిర్మాణం చేపట్టి మురుగునీరు మూసీలో కలిసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు చేసిన విజ్ఞప్తిని పరిశీలించారు. ఈ పనులకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జోనల్‌ కమిషనర్‌ అమిత్‌ నారాయణ, డిప్యూటీ కమిషనర్‌ లక్ష్మారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు
మీ పాయింట్ ఇక్కడ రాయండి...
🏠 Home