చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలి
చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలి
పట్టణ ఎస్ఐ గోపతి నరేష్
పట్టణ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
మందమర్రి, అక్టోబర్ 26 (తెలంగాణ ప్రజా గర్జన)
విద్యార్థులు చిన్నతనం నుండే చట్టం పట్ల గౌరవం, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగే క్రమశిక్షణను అలవర్చుకోవాలని పట్టణ ఎస్ఐ గోపతి నరేష్ సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో స్థానిక పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రిసెప్షన్ డెస్క్, మహిళా హెల్ప్ డెస్క్ కేసుల నమోదు విధానం, లాకప్ రూమ్స్ గురించి సమగ్రంగా వివరించారు. అదేవిధంగా సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎలా పనిచేస్తారు, శాంతిభద్రతలను కాపాడటంలో వారి పాత్ర ఏంటి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. మహిళల, బాలబాలికల భద్రత కోసం ఏర్పాటు చేసిన మహిళా సహాయ కేంద్రం విశిష్టతను, వివిధ అత్యవసర సహాయక హెల్ప్ లైన్ నెంబర్లను తెలియజేశారు. అదేవిధంగా శాంతిభద్రతల పరిరక్షణలో ఉపయోగించే వివిధ పరికరాలు, కమ్యూనికేషన్ సాధనాలు, ఆయుధాల గురించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ, దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంతో విద్యార్థులలో పోలీసులపై ఉన్న భయాలు తొలగి, పోలీసు వ్యవస్థ పట్ల సరైన అవగాహన, గౌరవం పెరుగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ స్టేషన్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.