🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2026, 9:29 pm Posted by : A2TV NEWS

చికిత్స పొందుతూ 13 ఏళ్ల బాలుడి మృతి.. ఆస్పత్రి ఎదుట కుటుంబ సభ్యుల నిరసన

: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 13 ఏళ్ల బాలుడు మృత్యువాత పడటంతో కుటుంబంలో విషాదం నెలకొంది. జరుపుల వినూత్ డెంగ్యూ, టైఫాయిడ్ లక్షణాలతో రెండు రోజుల క్రితం ఆదిభట్ల సర్కిల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం, సరైన చికిత్స అందకపోవడమే తమ కుమారుడి మరణానికి కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను కోరారు.
🏠 Home