🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 October 2026, 6:04 pm Posted by : TELANGANA PRAJA GARJANA

800 బాంబు బెదిరింపులు.. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

News Image
800 బాంబు బెదిరింపులు.. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

శంషాబాద్, అక్టోబర్ 26: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించిన నకిలీ బాంబు బెదిరింపుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ సుబ్రహ్మణ్యాన్ని ప్రత్యేక బృందాలు అక్కడ అదుపులోకి తీసుకున్నాయి. దేశంలోని వివిధ విమానాశ్రయాలకు సుమారు 800 నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని డీఎంకే పార్టీ నాయకులపై ఉన్న వ్యక్తిగత కక్షతో నిందితుడు ఈ చర్యలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి, ఆ నేరాన్ని డీఎంకే నేతలపై నెట్టి వారిని ఇబ్బందుల్లోకి నెట్టాలనే దురుద్దేశంతో వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.2025, 2026 సంవత్సరాల్లో నిందితుడు నిరంతరాయంగా నకిలీ బెదిరింపు మెయిల్స్ పంపినట్లు గుర్తించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏకంగా 45 సార్లు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాలకు మొత్తం 800 వరకు మెయిల్స్ పంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ బెదిరింపులతో విమానాశ్రయాల భద్రతా విభాగాలు అప్రమత్తమై తనిఖీలు చేపట్టాల్సి వచ్చింది.నిందితుడిని గుర్తించేందుకు శంషాబాద్ డీసీపీ, ఏసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సైబర్ నిఘా, సాంకేతిక ఆధారాల సాయంతో అతడు చెన్నైలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించారు. సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
🏠 Home