ఖర్గే వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం ప్రధాని కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు: బీజేపీ నేతలు రాజ్ భూపాల్ గౌడ్ ఆధ్వర్యంలో శంషాబాద్లో ఆందోళన.. పాల్గొన్న నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
తెలంగాణ ప్రజాగర్జన.శంషాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రంగారెడ్డి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో శంషాబాద్లో ఆందోళన నిర్వహించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ నేతృత్వంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, పాపయ్య గౌడ్, తోకల శ్రీనివాస్ రెడ్డి, మహేందర్, వై. శ్రీధర్, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డితో పాటు షాద్నగర్ నియోజకవర్గ నాయకులు వెంకటేశ్ గుప్తా, వంశీకృష్ణ, విఠల నరసింహ, మోహన్ సింగ్, మోటే శ్రీను, నరసింహ యాదవ్, శ్రీనివాస్ చారి, హరీష్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్, ఇతర జిల్లా, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు