మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి కార్మికులకు కొందుర్గు పోలీసుల అవగాహన అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పండ్లు, బిస్కెట్ల పంపిణీ
కొందుర్గు, అక్టోబర్ 26 (తెలంగాణ ప్రజాగర్జన: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొందుర్గు పోలీసులు కార్మికులకు నేరాల నివారణపై అవగాహన కల్పించారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని దివ్యశక్తి పేపర్ పంపిణీ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల భద్రత, సంక్షేమానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఛత్రియ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.