గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కొరత! మరుగుదొడ్లు లేవు.. నిరుపయోగంగా డంపింగ్ యార్డులు!
ముఖ్యమైన పాయింట్స్:గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కొరత!మరుగుదొడ్లు లేవు.. నిరుపయోగంగా డంపింగ్ యార్డులు!ప్రజావాణిలో పవన్ కళ్యాణ్ వినతి.. ఆర్‌టీఐ బోర్డుల ఏర్పాటుకు విజ్ఞప్తి
కొందుర్గు (తెలంగాణ ప్రజాగర్జన): మండలంలోని గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గంగన్నగూడెం గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ ప్రజావాణిలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. పలు పంచాయతీ కార్యాలయాల్లో మరుగుదొడ్లు లేక సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నిరుపయోగంగా ఉన్న డంపింగ్ యార్డులను వినియోగంలోకి తీసుకురావాలని కోరారు. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం–2005కు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు యాది రెడ్డి, రవి, టీఆర్‌పీ పార్టీ నాయకులు దర్గా వెంకటేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.