తొండుపల్లి చెరువులోకి మురుగునీరు! జలవనరులకు ముప్పు.. కాలుష్యంపై విచారణ ఏదీ? గోదాములు, పరిసర ప్రాంతాల వ్యర్థజలాలపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్
శంషాబాద్, అక్టోబర్ 25: శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి చెరువులోకి మురుగునీరు చేరుతోందన్న ఆరోపణలపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్ కోరారు. సమీప గ్రామాలు, ప్రైవేటు గోదాముల నుంచి వెలువడే వ్యర్థజలాలు చెరువులోకి చేరుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువు నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు. చెరువులు భూగర్భ జలాల పెరుగుదలకు, వ్యవసాయ అవసరాలకు కీలకమైన వనరులని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. గతంలో సమీపంలోని కాముని చెరువులో మురుగునీరు చేరిన పరిస్థితుల నేపథ్యంలోనైనా అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తొండుపల్లి చెరువులోకి మురుగునీరు చేరుతున్న విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, కాలుష్యానికి కారణాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. వ్యర్థజలాలు చెరువులోకి చేరకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా మురుగునీటిని విడుదల చేస్తున్నట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
111 జీవో నిబంధనలు అమలవుతున్నాయా? శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాల అనుమతులు, పర్యావరణ నిబంధనల అమలుపై అధికారులు సమగ్రంగా పరిశీలన చేపట్టాలని బైతి శ్రీధర్ కోరారు. భారీ షెడ్లు, గోదాములు, ఇతర నిర్మాణాల నుంచి వెలువడే వ్యర్థజలాల నిర్వహణపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెరువులు, జలవనరుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, తొండుపల్లి చెరువు కాలుష్యంపై వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని సంబంధిత అధికారులను కోరారు.